కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ విడ్డూరం
– 57 ఏండ్లలో యువతను మోసం చేసింది కాంగ్రెస్సే
– హస్తం పార్టీని ఎవ్వరు నమ్మేస్థితి లేదు
– బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పాలనో ఉద్యోగవకాశాలు
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో యువతకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న యూత్ డిక్లరేషన్ ఎంతో విడ్డూరంగా ఉందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటనను వ్యతిరేకించారు. 1969 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన తొలి దశ ఉద్యమంలో విద్యార్థులు, యువకుల మరణాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు. మలిదశ ఉద్యమంలో కూడా 1200ల మంది ఆత్మబలిదానాలకు కూడా కాంగ్రెస్ పార్టీనే కారణమని అందరికి తెలుసు అన్నారు. 57 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నీళ్లు, నిధులు, నియామకాలను పట్టించుకోలేదని, ఈరోజు యూత్ డిక్లరేషన్ అంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. (ఇంకా వుంది..)
సీఎం కేసీఆర్ పోరాట స్పూర్తితోనే తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. ఏ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత, నిరుద్యోగులకు రాష్ట్రం ప్రాధాన్యమిస్తోందన్నారు. తెలంగాణలో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిందని, ప్రైవేటు రంగంలో మరో 20 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించిందన్నారు. యువతకు ఉద్యోగవకాశాలు కల్పించడంలో తెలంగాణ దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇప్పుడు యూత్ డిక్లరేషన్ అంటూ మభ్యపెట్టేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
ఇవి కూడా చదవండి..
తట్టెపల్లిలో ఉద్రిక్తత..!
– మండల సాధన దీక్ష భగ్నం
– ఆందోళన కారులను అరెస్టు చేసిన పోలీసులు
– 32 రోజుల పోరాట దీక్ష నిర్వీర్యం
https://dharshininews.com/16998

