సూపర్ స్టార్‌తో పైలెట్..!

జాతీయం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ సినిమా

సూపర్ స్టార్‌తో పైలెట్..!
– రజనీకాంత్ ఇంటికి వెళ్లిన రోహిత్ రెడ్డి భేటీ
– గృహప్రవేశానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటి అయ్యారు. సోమవారం చెన్నైలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. వచ్చేనెల జూన్ 7వ తేదిన తాండూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి రావాలని సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం రాజకీయ అంశాలతో పాటు ఇతర విషయాలపై రజనీకాంత్, రోహిత్ రెడ్డిలు చర్చించుకున్నారు. మరోవైపు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భేటి కావడంపై తాండూరు నేతలు హర్షం వ్యక్తం చేశారు. సూపర్‌ స్టార్‌తో పాన్‌ ఇండియా స్టార్ పైలెట్‌ భేటి అదుర్స్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి…
రేషన్‌కు హెల్ప్‌ లైన్..!
– మీ కోటా ఇవ్వకుంటే కంప్లైట్ చేయొచ్చు
– తూకంలో మోసాలపై ఫిర్యాదుకు అవకాశం
https://dharshininews.com/17434

chaithany collage