మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌
– రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం
– గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మహిళ స్వయం సంఘాలకు సర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 15,037 కోట్లను రుణసాయం అందించేందుకు సెర్ప్‌ ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కింద ఈ రుణ సాయాన్ని అందించనున్నారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 4,30,358 స్వయం సహాయక సంఘాల్లో 46,46,120 మంది సభ్యురాళ్లున్నారు. పొదుపు ఖాతాలను ప్రారంభించిన సంఘాలకు రుణసాయం అందిస్తూ వస్తోంది. సంఘాలు తాము తీసుకున్న రుణాలను చెల్లించిన తర్వాత వాటి వడ్డీలను ప్రభుత్వం తిరిగి లబ్ధిదారులకు చెల్లిస్తోంది. గతేడాది సెర్ప్‌ రూ.12,000 కోట్ల బ్యాంకు రుణాలను లక్ష్యంగా నిర్దేశించగా, స్వయం సహాయక సంఘాలు రూ.12,722.14 కోట్ల రుణాలను పొందాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళా సంఘాలకు ఈ సారి అందించే రుణసాయం అత్యధికంగా నమోదు కానుంది. ఎలా అంటే గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.2315 కోట్లు అధికం ఉన్నట్లు బ్యాంకర్ల కమిటి తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున ఒక్కో డ్వాక్రా సంఘం రూ.20 లక్షల వరకు సాయం పొందే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి…
డెడ్‌ బాడీపై అఘోరా పూజలు
– స్నేహితుడి అంత్యక్రియల్లో ఘటన
https://dharshininews.com/17476

chaithany collage