జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు
– ఫ్రెండ్లీ పోలీసింగ్ బలోపేతం చేస్తాం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హత కలిగిన జర్నలిస్టులకు పోలీసు శాఖ తరుపున గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు డీఎస్సీ కార్యాలయంలో జర్నలిస్టులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై జర్నలిస్టులతో పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ జిల్లాలో గుర్తింపు లేని జర్నలిస్టుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్రిటేషన్ కార్డు కలిగిన వారితో పాటు పనిచేసే సంస్థ తరుపున ఐడీ కార్డులు ఉన్న జర్నలిస్టులకు పోలీసు శాఖ తరుపున గుర్తింపు కార్డులను అందజేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తామన్నారు. అక్రమ రవాణా, అసాంఘిక శక్తుల నిర్మూలనకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణ, సీఐలు రాజేందర్ రెడ్డి, జలంధర్ రెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

