లిఫ్ట్.. హెల్మెట్.. జైలు..!

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

లిఫ్ట్.. హెల్మెట్.. జైలు..!
– భర్త కొంప ముంచిన పనులు
– భార్య ఫిర్యాదుతో కేసు
– అసలేం జరిగిందంటే..?
దర్శిని డెస్క్‌: లిఫ్ట్.. హెల్మెట్.. జైలు.. ఈ మూడు పదాలు ఓ భర్త జీవితాన్నే మార్చేశాయి. భార్యకు అడ్డంగా దొరికిపోవడంతో ఆమె చేసిన ఫిర్యాదు వల్ల జైలు పాలు అయ్యాడు. పదండి ఆ కథేంటో చదువుకుని తెలుసుకుందాం.. కేరళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సేఫ్‌ కేరళ’ పేరుతో రాష్ట్రంలోని అన్ని రహదారులపై సీసీ కెమెరాలను ఇటీవల ఏర్పాటు చేసింది. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సేఫ్‌ కెమెరాలు ఫోటో తీసి చలాన్లు విధిస్తోంది. ఈ వ్యవస్థే ఇక్కడ ఓ టెక్స్‌టైల్‌ షాపులో పనిచేస్తున్న ఉద్యోగి పాలిట షాపమైంది. గత నెల ఏప్రిల్ 25న ఈ ఉద్యోగి ఓ యువతికి స్కూటర్‌పై లిఫ్టు ఇచ్చి రోడ్డుపై వెళుతున్నాడు. ఆ వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి.. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడంటూ.. అతనిని రోడ్డు పక్కన ఉన్న అత్యాధునిక కెమెరాలు బంధించాయి. అయితే ఆ ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ అతని భార్య పేరుతొ ఉంది.

అలా తీసిన ఫోటోతో పాటు.. మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ పంపిన వివరాలను అతని భార్య ఫోన్ నెంబర్ కు పంపించారు. జరిమానా చెల్లించాల్సిన వివరాలను ఆమె మొబైల్ ఫోన్‌కు మెసేజ్ చేశారు. మెసేజ్ ను చూసిన భార్య షాక్ తిన్నది. ఎందుకంటే భర్త బండి వెనుక వేరే మహిళ కూర్చుని ఉంది. ఇదే విషయంపై ఆ మహిళ ఎవరు అంటూ తన భర్తను ప్రశ్నించింది. దీంతో అతని కుటుంబంలో సమస్యలు తలెత్తాయి.. చినుకు, చినుకు గాలివాన అయినట్లు.. అతని గొడవ చివరకు పోలీసు కేసు వరకు వెళ్లింది. తన భర్త తనను, తమ కుమార్తె మూడేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. మే 5న ఇక్కడి కరమన పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. IPC 321 , 341 , 294 చట్టాలతో పాటు.. బాల్య న్యాయ చట్టంలోని సెక్షన్ 75 వంటి సెక్షన్ల కింద ఆమె భర్తపై కేసు పెట్టారు. అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరిచామని.. ఆ తర్వాత అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..
ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!
– ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు
– కేరళలో చోటు చేసుకున్న దారుణం
– సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్
– తీవ్ర సంచలనమైన ఘటన
https://dharshininews.com/17082